
- అత్యధిక మార్కులు సాధించిన స్టూడెంట్స్
- అభినందించిన కలెక్టర్, ఆఫీసర్లు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు ఇంటర్సెకండియర్ ఫలితాల్లో భద్రాద్రికొత్తగూడెంజిల్లా ఆరోస్థానంలో నిలిచింది. ఇంటర్ఫలితాలు మంగళవారం రిలీజ్ అయ్యాయి. జిల్లాలో 6984 మంది విద్యార్థులు సెకండియర్ఎగ్జామ్ కు అటెండ్కాగా 5103 మంది73శాతం ఉత్తీర్ణత రావడం అభినందనీయమని కలెక్టర్అనుదీప్అన్నారు. ఫస్టియర్ఫలితాల్లో 60శాతంతో రాష్ట్రస్థాయిలో12వ స్థానంలో జిల్లా నిలిచిందన్నారు. ఫస్టియర్ఒకేషనల్కోర్సుల్లో 2363 మంది విద్యార్థులకు1364 మంది ఉత్తీర్ణతతో తొమ్మిదో స్థానంలో నిలిచిందన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీనలంద జూనియర్ కాలేజీ స్టూడెంట్ ఎంపీసీలో 470 మార్కులకు467మార్కులు సాధించింది. ఒకేషనల్విభాగంలో సెకండియర్లో 1943 మందికి1484మంది ఉత్తీర్ణతతో ఐదోస్థానంలో నిలిచిందన్నారు. ఉత్తమ ఫలితాల సాధనలో కృషి చేసిన లెక్చరర్స్, సిబ్బందిని ఆయన అభినందించారు.
జిల్లాలో అమ్మాయిలే టాప్
ఖమ్మం, వెలుగు: జిల్లాలో ఇంటర్రిజల్ట్స్ లో మరోసారి అమ్మాయిలే పైచేయి సాధించారు. ఓవరాల్ ఫస్టియర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా 67శాతం పాస్ తో రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది. అమ్మాయిలు72శాతం, అబ్బాయిలు62శాతం మంది పాసయ్యారు. సెకండియర్రిజల్ట్స్ లో 74శాతం పాస్ తో నాలుగోస్థానంలో నిలిచింది. అమ్మాయిలు 80శాతం, అబ్బాయిలు 68శాతం మంది పాసయ్యారు. ఫస్టియర్లో జిల్లాలో మొత్తం15,450 మంది పరీక్షలకు అటెండ్కాగా10,456 మంది పాసయ్యారు. సెకండియర్లో13,339 మందికి 9964 మంది స్టూడెంట్స్ పాసయ్యారు. ఇక ఒకేషనల్ ఫలితాల్లో ఫస్టియర్లో 2446 మందికి1370మంది(56 శాతం) పాసయ్యారు. సెకండియర్ లో2071 మందికి1528(73 శాతం) మంది పాసయ్యారు.
రాష్ట్రస్థాయి మార్కులు..
మణుగూరు: ఇంటర్సెకండియర్ ఫలితాల్లో మణుగూరు స్టూడెంట్స్రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించారు. గవర్నమెంట్ కాలేజీలో బైపీసీ స్టూడెంట్ఎం.లహరికి 984, ఎం.వరలక్ష్మికి 981 రాష్ట్రస్థాయి మార్కులు వచ్చాయి.
మేస్త్రీ కుమార్తెకి అత్యధిక మార్కులు..
ములకలపల్లి: మండల కేంద్రంలోని తాపీమేస్త్రీ కుమార్తె కాకి అనూష ఇంటర్ రిజ ల్ట్లో 987 మార్కులు సాధించింది. ములకలపల్లి జీజేసీలో ఇంటర్ సెకండియర్ లో127 మంది పరీక్షలు రాయగా 110 మంది స్టూడెంట్లు పాసయ్యారు. వీరిలో అనూష 987 మార్కులతో సత్తాచాటింది. ములకలపల్లిలోని సోషల్వెల్ఫేర్కాలేజీలో ఇంటర్ సెకండియర్ స్టూడెంట్ప్రశాంతి 975 మార్కులతో కాలేజీ టాపర్ గా నిలిచింది. అత్యధిక మార్కులు సాధించిన స్టూడెంట్లను కాలేజీల ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు.
కేజీబీవీలో వందశాతం ఉత్తీర్ణత..
చండ్రుగొండ: మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయంలో ఇంటర్ ఫలితాల్లో స్టూడెంట్స్ వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్ లో ఎంపీహెచ్ డబ్య్లూలో వందశాతం, సీఈసీలో 84 శాతం, సెకండియర్ లో సీఈసీలో వందశాతం, ఎంపీహెచ్ డబ్య్లూలో వందశాతం ఉత్తీర్ణత సాధించారని స్పెషల్ఆఫీసర్ కాంతకుమారి తెలిపారు. కేజీబీవీ ఫలితాలపై ఎంఈవో సత్యనారాయణ, తహసీల్దార్రవికుమార్, ఎంపీడీవో రేవతి స్టూడెంట్లను అభినందించారు.
స్టేట్ టాపర్గా గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్
భద్రాద్రి కొత్తగూడెం: దుమ్ముగూడెం జీజేసీలో ఎంపీసీ సెకండియర్ కొండ సాయితేజ స్టేట్ టాపర్గా నిలిచాడు. 990 మార్కులు రావడం జిల్లాకే గర్వకారణమని ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. సాయితేజ ఫస్టియర్ లోనూ స్టేట్ టాపర్గా నిలిచారు. నిరుపేద కుటుంబానికి చెందిన సాయితేజ ప్రతిభ చాటడంపై కలెక్టర్ అనుదీప్, జడ్పీ చైర్మన్ కనకయ్య, ప్రభుత్వ విప్ కాంతారావు, ఇంటర్నోడల్ ఆఫీసర్ సులోచన రాణి హర్షం వ్యక్తం చేశారు.
ట్రైబల్ కాలేజీల్లో.. భిన్న ఫలితాలు
భద్రాచలం, వెలుగు: ఇంటర్ రిజల్ట్ లో ట్రైబల్కాలేజీల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఫస్టియర్లో పాస్పర్సంటేజీ తగ్గింది. సెకండియర్లో పెరిగింది. 2022లో ఫస్టియర్లో 81 శాతం రాగా, 2023లో 78శాతమే వచ్చింది. సెకండియర్లో 2022లో 85 శాతం రాగా, 2023లో 87 శాతం వచ్చింది. ఫస్టియర్లో గుండాలలోని రెండు ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీలతో పాటు, ఖమ్మం స్కూల్ ఆఫ్ఎక్స్ లెన్సీ కాలేజీ100శాతం రిజల్ట్ సాధించాయి. సెకండియర్లో ఒక్క కాలేజీ కూడా నూరుశాతం చేరుకోలేదు. ఖమ్మం రీజియన్లో భద్రాచలం కాలేజీ ఆఫ్ ఎక్స్ లెన్సీ బైబీసీ స్టూడెంట్సౌమ్య 984, ఎంపీసీ స్టూడెంట్ హేమశ్రీ 983 టాప్ మార్కులు సాధించారు. ఫస్టియర్లో ఖమ్మం ఎస్ఓఈ ఎంపీసీ స్టూడెంట్లు విక్రమ్ 466, శ్రీరాం 464, సుభాశ్464, గణేశ్ 462 మార్కులతో టాప్లో నిలిచారు. విద్యార్థులను ఐటీడీఏ పీవో గౌతమ్ శుభాకాంక్షలు తెలిపారు.