
ఎల్లారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి స్టూడెంట్ల మధ్య గొడవ జరిగింది. ఇంటర్‌సెకండ్ ఇయర్ స్టూడెంట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి తహసీల్దార్‌మహేందర్, సీఐ రవీందర్‌నాయక్, విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్‌కు చేరుకొని విచారణ చేపట్టారు. స్కూల్ ఆవరణలో బీర్‌బాటిళ్లు కనిపించడంతో వివరణ ఇవ్వాలని ప్రిన్సిపాల్‌నాగేశ్వర్‌ను ఆదేశించారు.