బోధన్ లో బస్సు కోసం స్టూడెంట్స్ రాస్తారోకో

బోధన్ లో బస్సు కోసం స్టూడెంట్స్ రాస్తారోకో

బోధన్,​ వెలుగు: సాలూరా మండల కేంద్రంలో కాలేజీ, స్కూల్​స్టూడెంట్స్ ​మంగళవారం రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేశారు. హున్సా నుంచి సాలూరా మీదుగా బోధన్​కు ఒకే బస్సు నడుపుతున్నారని, విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.

సాలూరా నుంచి స్పెషల్ ​బస్​ వేయాలని కోరారు. గతంలో రాస్తారోకో చేసినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు రాస్తారోకో విరమించమని భీష్మించుకొని కూర్చున్నారు. పోలీసులు, గ్రామపెద్దలు నచ్చజెప్పడంతో విరమించారు.