ఈరోజుల్లో లక్షలు పోసి చదివిస్తున్నా..పిల్లల చదువులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రైవేట్ ట్యూషన్లు పెట్టి మరీ చదవిస్తున్నారు తల్లిదండ్రులు.. సంపాదిం చింది మొత్తం పిల్లల చదవులకే పెట్టి ఇబ్బందులు పడుతూ పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి ప్రయోజకులను చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూపీలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపర్చింది. జైశ్రీరాం అని రాస్తే 50 శాతం మార్కులు వేశారట. లక్షలు పోసి చదివిస్తేనే చదువు అంతంతమాత్రంగా ఉంది.. ఇలాగైతే చదువు కొండొక్కినట్లే అని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
యూపీలోని VBSP యూనివర్సిటీలో నలుగురు డీఫార్మా విద్యార్థులు ఒక పరీక్షలో జై శ్రీరామ్ అని రాసి పాస్ అయ్యారు. ఎగ్జామ్ లో ఏదో తేడా జరిగిందని కొందరు అనుమానించి సమాచారం హక్కు చట్టం కింద ఇన్ఫర్మేషన్ తీసుకోగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టారు అధికారులు. మళ్లోసారి పునసమీక్షించి ఆ నలుగురు విద్యార్థులకు సున్నా మార్కులు ఇచ్చేలా పరిస్థితిదారితీసింది.ఈ తతంగంలో సూత్రధారులు అయిన ఇద్దరు టీచర్లపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఛాన్స్ లర్ ఆమోదించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ అధికారులు అంటున్నారు.
యూనివర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థి దివ్యవాన్సుసింగ్... ఆ నలుగురి విద్యార్థుల మార్కులను ప్రశ్నిస్తూ ఆర్టీఐ కి పిటిషన్ దాఖలు చేసి గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. VBSP వైస్ ఛాన్స్ లర్ వందనా సింగ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ లో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.