Suriya: కంగువ స్పెషల్ వీడియో రిలీజ్..కౌంట్‌ డౌన్‌ షురూ చేసిన మేకర్స్

Suriya: కంగువ స్పెషల్ వీడియో రిలీజ్..కౌంట్‌ డౌన్‌ షురూ చేసిన మేకర్స్

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. 

తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోన్నఈ మూవీ 2024 అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇదే విషయాన్నీ మేకర్స్ తమదైన శైలిలో తెలుపుతూ.."కింగ్‌ వస్తున్నాడు..పాన్ ఇండియా సినిమా రిలీజ్ కు ఇంకా 100 రోజులే" ఉందని తెలియజేస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్‌. 

కంగువ మూవీ దసరా కానుకగా 10 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు 300 నుంచి 350కోట్ల బ‌డ్జెట్‌తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా,వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పాలపాటి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సూర్యకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ దిషా పఠాని నటిస్తోంది.3Dలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు..రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. 

రీసెంట్గా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా..ఆడియన్స్ నుంచి భీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. కంగువలో సూర్య నట విశ్వరూపం చూపించాడు. అగ్నితో సెగలు రేపే అటవిక యోధుడిగా సూర్య వైల్డ్ లుక్ ఆకట్టుకుంటోంది. డైలాగ్స్ లేకుండా కట్ చేసిన ఈ టీజర్ లో విజువల్స్, నటి నటుల మైండ్ బ్లాంక్ చేసే లుక్స్ ,సూర్య, బాబీ డియోల్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు గూస్బంప్స్ అని చెప్పాలి. ఎంతో క్రూరంగా కనిపించే శవాల గుట్ట, భీకరమైన యుద్ధం, టీజర్ ఎండింగ్లో పెరుమర్చి అనే సూర్య వాయిస్..ఇలా ప్రతిదీ నెక్స్ట్ లెవల్ అనే విధంగా ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ బాక్గ్రౌండ్ స్కోర్ బీభత్సం అనేలా ఉంది.