చాలా మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదవులు చదవాలని కలలు కంటుంటారు. అలాంటి వారిలో ప్రతిభ ఉన్నా.. ఆర్థిక పరమైన ప్రోత్సాహం లేక వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికోసం యూనైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (USIEF) అకడమిక్ గైడెన్స్, ఫెలోషిప్ సపోర్ట్ అందిస్తుంది. యూఎస్ లో చదివే భారతీయ విద్యార్థులకు విద్యాపరమైన మార్గాలను సులభతరం చేస్తుంది. UNIEF ప్రారంభం నుంచి దాదాపు ప్రతి అకడమిక్ డొమైన్ లో దాదాపు 20వేల ఫుల్ బ్రైట్, ఫుల్ బ్రైట్ నెహ్రు, ఇతర ప్రతిష్టాత్మక గ్రాంట్లు, స్కాలర్ షిప్ లను అందిస్తుంది. పౌర సమాజంతో ఇంటర్ ఫేసింగ కోసం ఓ కీలక ఫోరమ్ గా పనిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ బ్రైట్ ప్రోగ్రామ్ లను అత్యధికంగా స్వీకరించే దేశాల్లో భారత్ ఒకటి.
అమెరికాలో చదువుకోవడానికి భారతీయ విద్యార్థులకు మరికొన్ని స్కాలర్ షిప్ లు:
టాటా స్కాలర్ షిప్ లు: ఈ స్కాలర్ షిప్ భారతదేశం నుంచి కార్నెల్ యూనివర్సిటీలో ప్రవేశానికి అంగీకరించబడిన అండర్ గ్రాడ్యయేట్ విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తుంది.
ఇన్ లాక్స్ శివదాసాని ఫౌండేషన్ స్కాలర్ షిప్ లు: విదేశాల్లో యువ భారతీయులు వృత్తిపరమైన, శాస్త్రీయ, కళాత్మక, సాంస్కృతిక సామర్థ్యం అభివృద్దికి వివిధ రంగాల్లో స్కాలర్ షిప్ లు, గ్రాంట్లు, అవార్డులను అందిస్తుంది ఇన్ లాక్స్ శివదాసాని స్కాలర్ షిప్ ఫౌండేషన్.
AAUW ఇంటర్నేషనల్ ఫెలోషిప్ లు:అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఉమెన్(AAUW) US లో గ్రాడ్యుయేట్ అధ్యయనం చేస్తున్న మహిళలకు ఫెలోషిప్ లను అందిస్తుంది. దీని ద్వారా యూఎస్ పౌరులు లేదా శాశ్వత నివాసితులుకాని మహిళలకు మద్దతును అందిస్తుంది.
హంఫ్రీ ఫెలోషిప్ ప్రోగ్రామ్: ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ యూఎస్ వంటి దేశాల్లో సమస్యల గురించి పరస్పర జ్ఞానం అవగాహన పెంపొందించేందుకు అనుభవజ్ఞులైన నిపుణుల కోసం ఏర్పాటు చేయబడింది.
రోటరీ పీస్ ఫెలోషిప్: రోటరీ అనేది 1.4 మిలియన్ల పొరుగువారు, స్నేహితులు, నేతలు, సమస్యలు పరిష్కరించే వ్యక్తులతో కూడిన గ్లోబల్ నెట్ వర్క్. ప్రతి సంవత్సరం రోటరీ ఫౌండేషన్ మాస్టర్స్ డిగ్రీల కోసం 50 ఫెలోషిప్ లను , యూనివర్సిటీల్లో సర్టిఫికేట్ అధ్యయనాలకోసం 80 వరకు ఫెలోషిప్ లను అందజేస్తుంది.
IMTACS గ్లోబాలింక్ రీసెర్చ్ ఇంటర్న్ షిప్: ఇది డైరెక్ట్ స్కాలర్ షిప్ కానప్పటికీ ఈ ప్రోగ్రామ్ భారతీయ విద్యార్థులు కెనడా యూనివర్సిటీల్లో పరిశోధన ఇంటర్న్ షిప్ లను అందిస్తుంది.