గ్రూప్1 ర్యాంకర్లలో స్టడీ సర్కిల్ స్టూడెంట్స్.. జనరల్ కేటగిరీలో ఏడుగురికి ర్యాంకులు

గ్రూప్1 ర్యాంకర్లలో స్టడీ సర్కిల్ స్టూడెంట్స్.. జనరల్ కేటగిరీలో ఏడుగురికి ర్యాంకులు

హైదరాబాద్, వెలుగు: టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్1 ర్యాంకుల్లో ఎస్సీ స్టడీ సర్కిల్‌‌‌‌లో కోచింగ్ తీసుకున్న అభ్యర్థుల్లో పలువురు ర్యాంకులు సాధించినట్లు ఎస్సీ డిపార్ట్‌‌‌‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ తెలిపారు. వనజ(38వ ర్యాంకు), మేరిగోల్డ్ (56), రవితేజ (66), కిషన్ పటేల్ (72), రాకేశ్‌‌‌‌ (78), శ్రావణ్ (84), ప్రవీణ్ (105)జనరల్ కేటగిరీలో ర్యాంకులు సాధించారని బుధవారం (April 2) ఒక ప్రకటనలో వెల్లడించారు. 

ఎస్సీ కేటగిరీలో 2, 3, 4, 10 ర్యాంకులు, ఎస్టీ కేటగిరీలో స్టేట్ 2వ ర్యాంక్, బీసీ డీలో స్టేట్ 10వ ర్యాంకు సాధించారన్నారు. స్టడీ సర్కిల్‌‌‌‌కు చెందిన 68 మంది అభ్యర్థులు 400 కంటే ఎక్కువ మార్కులు సాధించారని, వీరిలో 40 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. స్టడీ సర్కిల్‌‌‌‌లో కోచింగ్ ఇచ్చేందుకు సకాలంలో నిధులు రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.