యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పూర్వగిరి(పాతగుట్ట) నరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండోరోజైన శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు నల్లంథీఘల్, కాండూరి ఆధ్వర్యంలో ‘తిరుమంజనం’ వేడుకను నిర్వహించారు. సాయంత్రం దివ్యప్రబంధ సేవాకాలం ఉత్సవాన్ని నయనానందకరంగా జరిపించారు.
స్వామిఅమ్మవార్లను పూలతో సర్వాంగ అలంకరించి ఆలయ తిరువీధుల్లో విహరింపజేసి ‘పురప్పాట్టు సేవ’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో రామకృష్ణారావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవో గజవెల్లి రమేశ్ బాబు, సూపరింటెండెంట్ విజయ్ కుమార్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.