యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధ్యయనోత్సవాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు తిరుమంజనం, తొళక్కం పూజలతో అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు నిత్యారాధనలు, తిరుమంజనం జరిపించారు. ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్‌రావు, ఏఈవో జూశెట్టి కృష్ణ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
సోమవారం మొదలైన ఈ ఉత్సవాలు ఈ నెల 6 వరకు కొనసాగనున్నాయి. అధ్యయనోత్సవాల సందర్భంగా ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి మూలవరులకు ఉదయం పురప్పాటు సేవ, తిరుమంజనం సాయంత్రం దివ్య ప్రబంధ సేవాకాలం నిర్వహించనున్నారు.