విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తక్కువ వడ్డీకే స్టడీ లోన్స్

  • చదువు కోసం తక్కువ వడ్డీకే లోన్‌
  • ఆఫర్ చేస్తున్న టాప్ బ్యాంక్‌‌‌‌లు

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: పాపులర్‌‌‌‌‌‌‌‌ యూనివర్శిటీలలో హయ్యర్‌‌‌‌‌‌‌‌ స్టడీస్ చేయడానికి స్టూడెంట్లకు ఎడ్యుకేషన్ లోన్స్ సాయపడతాయి. ఇండియాలో లేదా విదేశాలలో చదవాలనుకునే వారికి ఫైనాన్షియల్ సంస్థలు అండగా ఉంటున్నాయి. తాజాగా దేశంలోని టాప్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లు అర్హులైన స్టూడెంట్లకు తక్కువ వడ్డీకే  ఎడ్యుకేషనల్‌‌‌‌ లోన్స్‌‌‌‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఎడ్యుకేషనల్ బ్యాక్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ ఆధారంగా స్టూడెంట్‌‌‌‌ లోన్లను ఫైనాన్షియల్ సంస్థలిస్తాయి. ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్లను పొందాలనుకునే వారికి ఈ కింది అర్హతలుండాలి..

ఇండియాకు చెందిన వారై ఉండాలి

దేశంలో లేదా విదేశాలలో అప్రూవల్‌‌‌‌ పొందిన ఎడ్యుకేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్‌‌‌‌లలో అడ్మిషన్‌‌‌‌ పొంది ఉండాలి

లోన్‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌ సబ్మిట్ చేసే టైమ్‌‌‌‌కి మినిమమ్‌‌‌‌ ఏజ్‌‌‌‌ 18 ఉండాలి. గరిష్టంగా 35 ఏళ్ల లోపు ఉండాలి.

ఫుల్‌‌‌‌ టైమ్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌ తీసుకుంటే పేరెంట్ లేదా గార్డియన్‌‌‌‌  కో–అప్లికేషన్‌‌‌‌ను సబ్మిట్‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. పెళ్లయిన వారు తమ జీవిత భాగస్వాముల కో–అప్లికేషన్‌ను కూడా సబ్మిట్‌ చేయొచ్చు.

బ్యాంకుల్లో స్టూడెంట్ లోన్‌‌‌‌ వడ్డీ రేట్లు..

ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్స్‌‌‌‌పై అతి తక్కువ వడ్డీ రేటును యూనియన్ బ్యాంక్‌‌‌‌ ఆఫర్ చేస్తోంది. రూ. 20 లక్షల లోన్‌‌‌‌పై ఏడేళ్లకు గాను ఏడాదికి 6.80 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఈ బ్యాంక్ తర్వాత అతి తక్కువ వడ్డీ రేటుతో సెంట్రల్‌‌‌‌ బ్యాంక్ ఎడ్యుకేషనల్ లోన్స్‌‌‌‌ను ఇస్తోంది. ఈ బ్యాంక్ ఏడాదికి 6.85 శాతం వడ్డీ రేటుతో ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్స్ ఇస్తోంది. స్టేట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఆఫ్ ఇండియా 6.9 శాతం వడ్డీ రేటుతో లోన్‌‌‌‌ను ఆఫర్ చేస్తోంది. బ్యాంక్‌‌‌‌బజార్‌‌‌‌‌‌‌‌.కామ్‌‌‌‌ ప్రకారం లోన్ అమౌంట్ రూ. 20 లక్షలపై, ఏడేళ్ల కాలపరిమితితో వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లు పైనున్నాయి.

ఈ డాక్యుమెంట్లు అవసరం..

బ్యాంకులను బట్టి పూర్తిగా డిజిటల్‌‌‌‌గాను లేదా బ్రాంచులకు వెళ్లి అప్లయ్ చేయడమో ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్‌‌‌‌కు అప్లయ్ చేసేటప్పుడు అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి. లేకపోతే లోన్‌‌‌‌ రిజెక్ట్ అవ్వొచ్చు. అప్లికేషన్ ఫార్మ్‌‌‌‌, 2 పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌ సైజ్‌‌‌‌ ఫోటోలు, స్టూడెంట్‌‌‌‌ లేదా కో–అప్లికేషన్ పెడుతున్న వారి పాన్‌‌‌‌ కార్డు లేదా ఆధార్ కార్డ్‌‌‌‌, ఏజ్‌‌‌‌ ప్రూఫ్‌‌‌‌, ఐడెంటెటీ ప్రూఫ్‌‌‌‌, రెసిడెన్సీ ప్రూఫ్‌‌‌‌, ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ప్రూఫ్‌‌‌‌లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

For More News..

జనవరిలో మనోళ్లు మస్తు తాగిన్రు.. ఒక్క నెలలోనే లిక్కర్ సేల్స్ 2,633 కోట్లు

ఆల్ టైం హైకు చేరిన కరెంట్ వాడకం.. ఉమ్మడి ఏపీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం

నేటి నుంచి రేషన్‌కు బయోమెట్రిక్ బంద్

భర్తను చంపినా.. భార్యకు పెన్షన్ ఇవ్వాల్సిందే