జీహెచ్ఎంసీ పథకాలపై ఏపీ ఆఫీసర్ల స్టడీ

జీహెచ్ఎంసీ పథకాలపై ఏపీ ఆఫీసర్ల స్టడీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో అమలు చేస్తున్న పథకాలపై అధ్యయనం చేయడానికి గురువారం ఏపీ నుంచి మున్సిపల్​ఆఫీసర్ల టీమ్ ​వచ్చింది. బల్దియా హెడ్డాఫీసులో ట్యాక్స్, ఫైనాన్స్, సీఆర్‌ఎంపీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగాలు తీసుకుంటున్న చర్యలను తెలుసుకుంది. 

అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీశ్, గీత రాధిక, సీఆర్‌ఎంపీ విభాగంలో సీఈ భాస్కర్ రెడ్డి, ఫైనాన్స్ అడ్వైజర్ శరత్ చంద్ర, సాలిడ్ వేస్ట్ మేనేజ్​మెంట్‌లో ఎస్‌ఈ కోటేశ్వర రావు, చీఫ్ వాల్యుయేషన్ ఆఫీసర్ మహేశ్​ కులకర్ణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

ఏపీ అధికారుల టీమ్​లో గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు, ఈఈ సుందర రామిరెడ్డి, ఏలూరు కమిషనర్ భాను ప్రతాప్, ఏఈ ఎలక్ట్రికల్ శేషగిరిరావు, రెవెన్యూ ఇన్​స్పెక్టర్ నంబూరి రవి, నెల్లూరు మున్సిపల్​  కార్పొరేషన్ ఎస్ఈ గిరిధర్, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ కాలూరి వెంకట నాగరవి, మనోజ్ కుమార్ తదితరులు ఉన్నారు.