Good Health : మీరు కోడిగుడ్లు ఎక్కువ తింటున్నారా.. అయితే గుండె పోటు నుంచి తప్పించుకున్నట్లే..

Good Health : మీరు కోడిగుడ్లు ఎక్కువ తింటున్నారా.. అయితే గుండె పోటు నుంచి తప్పించుకున్నట్లే..

గుడ్లు అతిగా తింటే హెల్త్ కు మంచిది కాదు.. కొలెస్టరాల్ పెరుగుతుంది.. ఆరోగ్యానికే హానికరం అని వింటుంటాం. అయితే అదంతా తూచ్ అంటా..  గుడ్లు ఎక్కువ తింటే హెల్త్ కు మంచిదంట. గుండె సమస్యల వల్ల వచ్చే  మరణ ముప్పును తగ్గిస్తుందని (ASPREE) అధ్యయనం వెల్లడించింది.  

అధ్యయనం ఏంటంటే..?

8 వేల కంటే ఎక్కువ మంది వ్యక్తులపై అధ్యయనం చేసింది సంస్థ. వారు తినే ఆహార పధార్థాలను  కొన్ని రోజులుగా అధ్యయనం చేశారు. ఆరు సంవత్సరాల తర్వాత సర్వేలో పాల్గొన్న ఎంత మంది చనిపోయారు..ఏ కారణాల వల్ల చనిపోయారని రికార్డులు పరిశీలించారు.  వారి రోజు వారి డైట్ డీటేల్స్ ను సేకరించారు.  ఇందులో  తరచుగా ఎన్ని గుడ్లు తిన్నారనేదానిపై ఆరాదీశారు.

కొందరు అరుదుగా.. కొందరు  నెలకు రెండు సార్లు గుడ్డు తిన్నారు. మరి కొందరు వారానికో సారి, రోజుకు చాలా గుడ్లు  తిన్న వాళ్లు కూడా ఉన్నారు.  అయితే అరుదుగా లేదా గుడ్లు తినని వారితో పోలిస్తే..   వారానికి ఐదారు  గుడ్లు తినే  వ్యక్తుల్లో  మరణ ముప్పు తక్కువగా ఉందంట. రోజూ గుడ్లు తినడం వల్ల కూడా మరణ ప్రమాదం ఎక్కువగా లేదంట.

గుడ్లలో   బి విటమిన్లు, ఫోలేట్, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, కొవ్వులో కరిగే విటమిన్లు (A, D, E , K), కోలిన్  ఖనిజాలను కలిగి ఉంటాయి.గుడ్డులో విటమిన్ బి, బి12, బి5, బయోటిన్, రైబోప్లేవిన్, థయమిన్, సెలీనియం ఉంటాయి. ఈ విటమిన్స్ శరీరానికి అందడం వల్ల ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం, గోళ్లు సొంతం అవుతాయి. ఈ విటమిన్స్ కణాలకు పోషకాలు అందించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది 

ఒక పెద్ద గుడ్డు పచ్చ సోనలో దాదాపు 275  మిల్లిగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. 70 శాతం మందిలో కొలెస్ట్రాల్ పెరగడానికి గుడ్డు కారణం కాదు. మిగిలిన 30 శాతం మందిని హైపర్ రెస్పాండర్స్ అని పిలుస్తారు. వీళ్లు గుడ్లు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే గుడ్డు మంచి కొలెస్ట్రాల్ పెంచడంలోనూ తోడ్పడుతుంది. మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లకు గుండె జబ్బుల ముప్పు తక్కువ. రోజుకు రెండు గుడ్లు... ఆరు వారాలు తింటే మంచి కొలెస్ట్రాల్ పది శాతం పెరుగుతుందని స్టడీల్లో తేలింది. 

ఒకేసారి రెండు గుడ్లు తీసుకోవడం వల్ల 59 శాతం సెలీనియం, 32 శాతం విటమిన్ ఏ, 14 శాతం ఐరన్ శరీరానికి అందుతుంది. ఈ పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. జలుబు, జ్వరాన్ని పోగొట్టడంలోనూ గుడ్డుది ముఖ్య పాత్ర అని పరిశోధకులు చెబుతున్నారు. సో ఈ లెక్కన ఏదైనా అతిగా తినకండి..మోతాదుకు మించినా తగ్గినా హెల్త్ కు ప్రమాదమే. మనకున్న హెల్త్ సమస్యలను బట్టి డైటీషియన్ సూచనలతో గుడ్లను  తినడం బెటర్.