Food Alert : ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. మీకు లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ..!

Food Alert : ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. మీకు లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ..!

ఇటీవల కాలంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. క్యాన్సర్ పై అవగాహన అవసరాన్ని మరింత పెంచుతోంది. ప్రతి లక్ష మందిలో 100మందికి క్యాన్సర్ ఉంది. 2022 నాటికి దేశంలో 14.60 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. 2025 నాటికి 12.8 శాతం క్యాన్సర్ రోగులు పెరిగే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే క్యాన్సర్ బారిన పడేందుకు మన జీవన శైలి, తీసుకునే ఆహారం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. వీటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి. 

క్యాన్సర్లలో లంగ్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది. ప్రాణాంతకమైనది. ఇతర క్యాన్సర్లకంటే ఊపిరితిత్తులకు సోకిన క్యాన్సర్ కు ట్రీట్ మెంట్ కూడా కష్టంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. లంగ్ క్యాన్సర్ కు కారణాల్లో మనం తీసుకునే ఆహారం ఓ ప్రధాన కారణం అంటున్నారు ఫ్లోరిడా హెల్త్ యూనివర్సిటీ పరిశోధకులు. పేలవమైన ఆహారం లంగ్ క్యాన్సర్ ఓ కారణమని అంటున్నారు. కొవ్వులు, ఫ్రక్టోజ్ లు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్ (ప్రాశ్చాత్య) గ్లైకోజన్ స్థాయిలను పెంచుతాయంటున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్కు మనం తీసుకునే ఆహారం ఎలా కారణమవుతుందో ఈ పరిశోధనలు వెల్లడించాయి. క్యాన్సర్ నివారణకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెబుతున్నాయి. 

Also Read:-పిల్లల ముందు అలా మాట్లాడొద్దు.. అస్సలు మంచిది కాదు..

ఈ ఫుడ్ తింటే.. 

ప్రాసెస్ చేసిన ఆహారాలు, నిల్వ ఉంచిన ధాన్యాలు, ఎర్ర మాంసం, అధిక కొవ్వు పాల ఉత్పత్తులు, చక్కెర ఉన్న డ్రింక్స్,ఫాస్ట్ ఫుడ్ ,ఉప్పగా ఉండే స్నాక్స్  వంటి ఆహార పదార్ధాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అదేవిధంగా పండ్లు, కూరగాయలు ,తృణధాన్యాలు తక్కువగా తీసుకోవడం వల్ల కూడా లంగ్స్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆహారపదార్థాలు గ్లౌకోజన్ స్థాయిని పెంచుతాయి. ఇది ఊపిరితిత్తులలో ట్యూమర్లను ఏర్పడేందుకు కారణమం అవుతాయని నేచర్ మెటాబాలిజమ్ అనే జర్నల్ లో  లంగ్ క్యాన్సర్ పై అధ్యయనం రిపోర్టు ప్రచురించారు. 

శాస్త్రవేత్తలు ఎలుకలపై ఈ ప్రయోగం జరిపారు. వాటికి అధిక కొవ్వు, అధిక ప్రక్టోజ్ ఉన్న జంక్ ఫుడ్ ఇచ్చినప్పుడు రక్తంలో గ్లైకోజెన్ బాగా పెరిగింది.ఊపిరితిత్తుల్లో కణితులు పెరిగాయి. గ్లైకోజెన్ స్థాయిలు తగ్గినప్పుడు కూడా కణితి పెరుగుదల ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.