ఉన్నత లక్ష్యంతో చదువును కొనసాగించాలి : సీఎస్ రంగరాజన్

ఉన్నత లక్ష్యంతో చదువును కొనసాగించాలి :  సీఎస్ రంగరాజన్
 
  •     చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు 
  •     చిలుకూరు ప్రభుత్వ బడిలో నోట్​ బుక్స్​ పంపిణీ

చేవెళ్ల, వెలుగు: ఉన్నత లక్ష్యంతో చదువును కొనసాగించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ సూచించారు. బుధవారం ఆయన మొయినాబాద్​మండలం చిలుకూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉచితంగా నోట్​బుక్స్​పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రంగరాజన్​మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో ఎంతో నైపుణ్యం ఉన్న టీచర్లు ఉన్నారని, ఉన్నత లక్ష్యంతో చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే దిశగా చదువును కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారంతా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్నవారేనని స్ఫూర్తి నింపారు. ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయాలని, ఇక్కడి స్టూడెంట్లను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అర్చకుని సహాయకుడు పవన్​కుమార్, స్కూల్​హెచ్ఎం భీమయ్య, టీచర్లు శ్రీనివాస్​రెడ్డి, రాజశేఖర్, రమాదేవి, రాజు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.