లవరా లేక కిల్లరా?..లైలా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల

లవరా లేక కిల్లరా?..లైలా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లైలా’. ఇందులో అతను అబ్బాయి, అమ్మాయిగా యూనిక్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతున్నాడు.  రామ్ నారాయణ్ దర్శకుడు.  సాహు గారపాటి నిర్మిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన లైలా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ ఐ లుక్‌‌‌‌కి పాజిటివ్ రెస్పాన్స్ రాగా.. క్రిస్మస్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.   ఇందులో సోను మోడల్‌‌‌‌ అనే పాత్రను పోషిస్తున్న విశ్వక్...  పోస్టర్‌‌‌‌‌‌‌‌లో స్టైలిష్, రిచ్ గెటప్‌‌‌‌లో కనిపించాడు.

ఒక చేతిపై సోను లవర్,  మరో చేతిపై సోను కిల్లర్ అని టాటూస్ ఉండటం ఆసక్తి రేపుతోంది.  రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతున్న  ఈ చిత్రంలో విశ్వక్‌‌‌‌కు జంటగా ఆకాంక్ష శర్మ నటిస్తోంది.  లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.  ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమా విడుదల కానుంది.