Hurricane Milton:ఫ్లోరిడాలో మిల్టన్ హరికేన్ తుఫాను..స్పేస్ నుంచి స్టన్నింగ్ వీడియోస్

Hurricane Milton:ఫ్లోరిడాలో మిల్టన్ హరికేన్ తుఫాను..స్పేస్ నుంచి స్టన్నింగ్ వీడియోస్

మిల్టన్ హరికేన్..ఫ్లోరిడాను వణికించిన భారీ తుఫాను. ఈ తుఫాను ధాటికి  గత రెండురోజులుగా ఫ్లోరిడా అతలాకుతలం అయింది. మిల్టన్ హరికేన్ బీభత్సానికి ముగ్గురు చనిపోయారు. దాదాపు మూ డు లక్షల మంది కరెంట్ లేక చీకిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా మిల్టన్ తుఫాను అల్లకల్లోలం సృష్టించింది.గురువారం ( అక్టోబర్ 10, 2024) నాడు కొద్దిగా తన ఉధృతిని తగ్గించింది. 

మాథ్యూ డొమినక్ ఆస్ట్రోనాట్ అనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న ఆర్బిటల్ ల్యాబ్ ఫ్లైట్ ఇంజనీర్ హరికేన్ మిల్టన్ కు సంబంధించిన స్టన్నింగ్ వీడియోలు, ఫొటోలను తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో షేర్ చేశారు. 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని తన స్లీపింగ్ క్వార్టర్స్ కిటికీ నుంచి మిల్టన్ హరికేన్ కనిపించినట్లు తెలిపాడు. డొమినిక్ షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు..బుధవారం నాడు ఫ్లోరిడా పశ్చిమ తీరాన్ని సమీపిస్తున్నపుడు మిల్టన్ హరికేన్కు సంబంధించిన దృశ్యాలను షేర్ చేశారు. నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ తీసిన టైమ్ లాప్స్ వీడియోలు డ్రాగన్ ఎండీవర్ అంతరిక్ష నౌక నుంచి తీసినవి. 

అంతరిక్షం నుచి తీసిన ఫొటోలు , వీడియోలు గల్ఫ్ ఆఫ్ మెక్సికో లోని ఫ్లోరిగా వైపు దూసుకొస్తున్న భారీ తుఫాను మిల్టన్ హరికేన్ ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాయి. ఈ తుఫాన్ కేటగిరి 3 గా ఉంటుందని అంచనా వేశారు. ఆ తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా కదులుతున్నప్పుడు మిల్టన్ కేటగిరి 4నుంచి 5 మధ్య కొనసాగిందని ఆస్ట్రోనాట్ చెప్పారు. 

ALSO READ : హరికేన్​ మిల్టన్​ బీభత్సం.. ఫ్లోరిడాకు తుఫాను ముప్పు

డొమినిక్ తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏడు నెలలుగా బస చేస్తున్నారు. సోమవారం తిరిగి భూమికి రావాల్సి ఉండగా.. భారీ తుఫాను కారణంగా వారి రాక ఆలస్యం అయింది.