టీ20 క్రికెట్ వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్నమైన షాట్స్ వచ్చాయి. మెక్కలం, డివిలియర్స్, సూర్య కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఎన్నో విభిన్న షాట్స్ ను ప్రపంచ క్రికెట్ కు పరిచయం చేశారు. తాజాగా న్యూజీలాండ్ ఆటగాడు రచీన్ రవీంద్ర ఒక కొత్త షాట్ తో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. క్రికెట్ లో టెన్నిస్ షాట్ ఆడి ఔరా అనిపించాడు. మేజర్ లీగ్ క్రికెట్ లో భాగంగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్, వాషింగ్టన్ ఫ్రీడమ్‌ల మధ్య మంగళవారం (జూలై 16) జరిగిన మ్యాచ్ లో ఈ షాట్ చోటు చేసుకుంది.
వాషింగ్టన్ ఫ్రీడమ్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌లో జట్టు స్కోర్ 3 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఈ ఓవర్ లో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బోల్ట్ ఒక స్లో బౌన్సర్ ను విసిరాడు. అయితే బంతి ముందుగానే స్లో గా వస్తుందని అంచనా వేసిన రవీంద్ర.. లంగాన్ దిశగా సిక్సర్ బాదాడు.ఈ షాట్ టెన్నిస్ లో బ్యాక్ హ్యాండ్ షాట్ ను తలపించింది. సాధారణంగా స్లో బంతులను సిక్సర్ కు తరలించడం చాలా కష్టం. అయితే రవీంద్ర మాత్రం అలవోకగా పంపించేశాడు. గ్రౌండ్ లో ఉన్న అభిమానవులతో పాటు బౌలర్ బోల్ట్ సైతం ఈ షాట్ చూసి ఆశ్చర్యపోయారు.
Also Read :- హిట్ మ్యాన్ వచ్చేస్తున్నాడు
ఈ మ్యాచ్ లో రచీన్ రవీంద్ర 14 బంతుల్లో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ కివీస్ బ్యాటర్ ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లున్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, గౌస్ హాఫ్ సెంచరీలతో రాణించారు. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 88 పరుగులే ఆలౌటైంది. మ్యాక్స్ వెల్ 5 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
WHAT A SHOT BY RACHIN RAVINDRA IN MLC. 🥶 🌟 pic.twitter.com/23iP1FFkB7
— Johns. (@CricCrazyJohns) July 17, 2024