
శంషాబాద్, వెలుగు: శంషాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లతో ప్రమాదకర స్టంట్స్ చేసిన నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను శంషాబాద్ రూరల్ పీఎస్లో ఏసీసీ శ్రీనివాస్ సోమవారం వెల్లడించారు.
శంషాబాద్ నుంచి పెద్ద గోల్కొండ వెళ్లే దారిలో ఓఆర్ఆర్పై ఇటీవల నంబర్ ప్లేట్లు లేని ఒక బీఎండబ్ల్యూ, మరో ఫార్చునర్తో కలిసి స్టంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా కారు డ్రైవ్ చేసిన నిందితులను హైదరాబాద్ లోని నాంపల్లి ప్రాంతానికి చెందిన ఉమెదుల్లా, సిద్ధిగా గుర్తించి సోమవారం అరెస్ట్ చేశారు.
వీరితోపాటు కారుల్లో ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.