![ఓఆర్ఆర్పై కార్లతో స్టంట్లు](https://static.v6velugu.com/uploads/2025/02/stunts-with-cars-on-outer-ring-road_iWQEPzmCkt.jpg)
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండల పరిధిలోని ఓఆర్ఆర్ పై కార్లతో కొందరు వ్యక్తులు స్టంట్లు చేయడం కలకలం సృష్టించింది. రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు శంషాబాద్ టోల్‌గేట్ ఎగ్జిట్ నెం.16, పెద్ద గోల్కొండ టోల్‌గేట్ ఎగ్జిట్ నెం. 15 మధ్య ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కార్లతో స్టంట్లు క్రియేట్ చేశారు.
ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు రాగా.. వారు కార్లలో పారిపోయారు. ఆ కార్లకు నంబర్ ప్లేట్లు లేవని పోలీసులు తెలిపారు. త్వరలోనే ట్రెస్ చేసి పట్టుకుంటామని సీఐ పేర్కొన్నారు.