- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఎస్టీయూటీఎస్ నేతల వినతి
హైదరాబాద్, వెలుగు: ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్అసిస్టెంట్స్కు ఓటు హక్కు కల్పించాలని ఎస్టీయూటీఎస్ నేతలు కోరారు. ఎస్ టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వత్‌రెడ్డి, సదానందం గౌడ్, మాజీ అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే 80 శాతం మంది ఉపాధ్యాయులు ఉన్నత విద్యావంతులుగా ఉన్నా.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇవ్వడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు.