
ఆ వూరు చెపితే చాలు.. బాబోయ్ దొంగలు అంటారు. అక్కడ నుంచి వచ్చారంటే చాలు.. అలాంటి వారిపై ఓ కన్ను వేసి ఉంచుతారు ఎక్కడ ఏ వస్తువు దొంగతనం చేస్తారేమోనని జనాలు భయపడతారు. కాని ఇప్పుడు ఆ వూరికి చెందిన ఓమహిళ ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ వీసీగా నియమితులయ్యారు. ఇంతకూ ఏమాఊరు.. ఎవరామహిళ వైస్ ఛాన్స్లర్ గురించి తెలుసుకుందాం..
దొంగల ఊరుగా గుంటూరు జిల్లా స్టూవర్ట్పురంపేరుగాంచింది. ఆ ఊళ్లో విద్యావంతులు కూడా ఉంటారని రుజువు చేసింది ఓ గిరిజన మహిళ. ఎప్పుడో తాతల కాలంలో ఉన్న స్టూవర్టు పురం.. ఇప్పుడు సామాజికవేత్త లవణం, హేమలత తదితర ప్రముఖల కృషి కారణంగా అక్కడుండే చాలామంది మారిపోయి, చదువుకొని ఉద్యోగాలు పొంది, ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అలాంటి ఊరి నుంచే వచ్చిన ఓ గిరిజన మహిళ తొలిసారి వీసీగా మారారు. ఆమే సాతుపాటి ప్రసన్నశ్రీ. ఏపీ ప్రభుత్వం ఆమెను రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా నియమించారు. వీసీగా తొలి ఎరుకల సామాజికవర్గ మహిళ కావడం విశేషం
ఏపీలోని పలు యూనివర్సిటీలకు ప్రస్తుతం ఉన్న ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ ల స్థానంలో రెగ్యులర్ వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ గా ఆంధ్రా యూనివర్సిటీ లో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రసన్న శ్రీ నియామకం అయ్యారు.
సర్దార్ పటేల్ మహావిద్యాలయలో పీహెచ్‌డీ చేసిన ఆమె తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం మొదలుపెట్టారు. ఆంధ్రా వర్సిటీలో ప్రొఫెసర్‌గా రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు.ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీగా నారీ శక్తి పురస్కార గ్రహీత విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ విసీలను నియమించి విశ్వవిద్యాలయాలలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.
రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్సలర్ గా నియమించిన ప్రొఫెసర్ ప్రసన్న శ్రీ అంతరించిపోతున్న గిరిజన భాషలను కాపాడటానికి .. గిరిజనుల జీవన స్థితిగతులు, భాషలపై చేసిన పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో ఆమె చేసిన కృషిని మెచ్చిన కేంద్ర ప్రభుత్వం 2021లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నారీ శక్తి పురస్కారాన్ని అందించారు.19 గిరిజన భాషలకు అక్షరాలు రాసి అమెరికాలో ప్రతిష్ఠాత్మక ఎన్‌డేంజరెడ్ పురస్కారాన్ని అందుకున్నారు. 125 పరిశోధన వ్యాసాలు రాశారు. ఇప్పటికి 40కి పైగా అవార్డులు అందుకున్నారు.