ట్యాక్స్ చెల్లించకుంటే ప్రాపర్టీ సీజ్ : సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్

ట్యాక్స్ చెల్లించకుంటే ప్రాపర్టీ సీజ్ : సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్

మిర్యాలగూడ, వెలుగు : మున్సిపాలిటీ పరిధిలో ట్యాక్స్ చెల్లించకుంటే ప్రాపర్టీ సీజ్ చేయాలని సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ అధికారులను ఆదేశించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో రెడ్ నోటీస్ లకు స్పందించని వారి ప్రాపర్టీస్ ను శుక్రవారం పోలీసుల సమక్షంలో ఆయన సీజ్ చేశారు. ఈ సందర్భంగా అమిత్ మాట్లాడుతూ మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ రూ.10 కోట్లు లక్ష్యం పెట్టుకోగా, రూ.7 కోట్ల వరకు వసూలు చేశామన్నారు. 

పెండింగ్ లో ఉన్న రూ.3 కోట్ల ట్యాక్స్ వసూలుకు పదిరోజులే గడువు మిగిలి ఉందన్నారు. నోటీసులకు స్పందించని హెచ్ పీ పెట్రోల్ బంక్, మదీనా కాంప్లెక్స్, యమహా షోరూంతోపాటు మొత్తం 10 ప్రాపర్టీస్ సీజ్ చేయడంతోపాటు రూ.14 లక్షలు వసూలు చేసినట్లు వివరించారు. ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ పూర్తయితేనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయని తెలిపారు. ప్రాపర్టీ ఓనర్లు తక్షణమే బకాయిలు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశంలో డీఏవో శ్రీనివాస్ శర్మ, మున్సిపల్ కమిషనర్ యూసూఫ్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు..