మధిరలో త్వరలో సబ్​ కోర్టు ప్రారంభం

  •     ఖమ్మం జిల్లా  న్యాయమూర్తి బీహెచ్ జగ్జీవన్ కుమార్ 

మధిర, వెలుగు: మధిర లో త్వరలోనే సబ్​ కోర్టు ప్రారంభిస్తామని ఖమ్మం జిల్లా  న్యాయమూర్తి బీహెచ్ జగ్జీవన్ కుమార్ తెలిపారు. ఆదివారం పట్టణానికి వచ్చిన ఆయన  సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించేందుకు భవనాలను పరిశీలించారు. మధిర లోని సమీకృత రైతుబజార్, మార్కెట్ యార్డ్ భవనాలను సందర్శించారు.

మధిర పాత కోర్ట్ భవనంలో ఉన్న రికార్డు రూమ్ ను వెంటనే తరలించి కొత్త భవన నిర్మాణాన్ని  వెంటనే ప్రారంభించాలని ఆర్ ఎండ్ బీ అధికార్లకు సూచించారు. కార్యక్రమం లో మధిర కోర్ట్ న్యాయమూర్తి టీ.కార్తీక్ రెడ్డి, మధిర తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్​ అండ్ ​బీ, మున్సిపల్, మార్కెట్​ యార్డు, పోలీసు అధికారులతో పాటు న్యాయవాదులు, కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.