గాడియంలో సబ్ -జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ షురూ

హైదరాబాద్, వెలుగు: ఐదో ఎడిషన్ సబ్- జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌ షిప్ హైదరాబాద్ గాడియం స్పోర్టోపియాలో శనివారం  మొదలైంది.  నాలుగు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో  దేశ వ్యాప్తంగా 750 మంది యంగ్ షట్లర్లు అండర్–-11,-13,-15 ఏజ్ కేటగిరీల్లో  సింగిల్స్, డబుల్స్, మిక్స్​డ్​ డబుల్స్ ఈవెంట్స్ లో పోటీ పడుతున్నారు. నేషనల్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌, గాడియం స్కూల్ చైర్మన్ నిత్యానంద రెడ్డితో కలిసి ఈ టోర్నీని లాంఛనంగా ప్రారంభించాడు. ఆటలో క్రమశిక్షణ, పట్టుదల చాలా ముఖ్యమైన విషయాలని క్రీడాకారులకు చెప్పాడు.