సబ్‌సోనిక్ క్రూయిజ్ మిస్పైల్‌ను భారత్ ఇవాళ (సోమవారం) విజయవంతంగా పరీక్షించింది. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేజ్ (ITR) ప్రయోగ శాల కాంప్లెక్స్-3 నుంచి ఉదయం 11.44 గంటలకు ఒడిశా తీరం నుండి నిర్భయ్ మిస్సైల్‌ను పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. నిర్భయ్ మిస్సైల్ వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధిస్తుంది. ధ్వని వేగం కన్నా తక్కువ వేగంతో ఈక్షిపణి ప్రయాణిస్తుంది.
వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ఇది చేధిస్తుంది. ధ్వని వేగం కన్నా తక్కువ వేగంతో ఈ క్షిపణి ప్రయాణిస్తుంది. బెంగళూరుకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(ADE) దీన్ని అభివృద్ధి చేసింది. నిర్భయ్ సుదూరం ప్రయాణించే క్షిపణి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో దీన్ని ప్రయోగించే వీలుంటుంది. ఎటువంటి ప్లాట్‌ఫార్మ్ నుంచి అయినా దీన్ని లాంచ్ చేయవచ్చు. నిర్భయ్.. సాంప్రదాయ అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. టేకాఫ్ కోసం రాకెట్ బూస్టర్‌ని వినియోగిస్తారు. అయితే ఎత్తుకు వెళ్లిన తర్వాత .. టర్బోఫ్యాన్ ఇంజిన్ ద్వారా ఇది టార్గెట్‌ను చేరుకుంటుంది. ఎత్తును పర్యవేక్షించేందుకు రేడియో ఆల్టీమీటర్‌ను వాడుతారు.