బీజింగ్​లో రికార్డ్ స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు

బీజింగ్: చైనా రాజధాని బీజింగ్ ఏడు దశాబ్దాల్లోనే డిసెంబర్ లో ఎన్నడూ లేనంత తీవ్రమైన చలిని చవి చూసింది. మంచు తుఫానుల కారణంగా ఆ దేశంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 11 నుంచి దాదాపు 300 గంటల పాటు మైనస్ డిగ్రీల్లోనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని బీజింగ్ వాతావరణ కేంద్రం  తెలిపింది. 1951 తర్వాత నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఇవేనని చెప్పింది. వరుసగా తొమ్మిది రోజుల పాటు –10 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ నమోదైందని పేర్కొంది. ఉత్తర, మధ్య చైనా ప్రాంతాలను చలిగాలులు చుట్టు ముట్టాయి. ఈ ప్రాంతాల్లో డిసెంబర్ నెలలో సగటు ఉష్ణోగ్రతలు 1961లో నమోదైన కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.  దీంతో ఆ ప్రాంతాల్లోని స్కూళ్లను అధికారులు బంద్ చేశారు.