గలీజ్​గా సుబ్బయ్యగారి హోటల్​ కిచెన్..పొంగుతున్న డ్రైనేజీ.. పాడైన ఆకుకూరలు

గలీజ్​గా సుబ్బయ్యగారి హోటల్​ కిచెన్..పొంగుతున్న డ్రైనేజీ.. పాడైన ఆకుకూరలు

గచ్చిబౌలి, వెలుగు: రోజంతా భోజన ప్రియులతో కిక్కిరిసి కనిపించే కొండాపూర్​సుబ్బయ్యగారి హోటల్​లో శుక్రవారం ఫుడ్​సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కిచెన్​లో పొంగుతున్న ఓపెన్​డ్రైనేజీ ఉన్నట్లు, అపరిశుభ్ర వాతావరణంలో వంట చేస్తున్నట్లు గుర్తించారు. వాడిపోయిన ఆకుకూరలు బూజు పట్టినట్లు గుర్తించారు.

కిచెన్​ఫ్లోరింగ్​మొత్తం పగుళ్లు ఏర్పడి, మురుగునీరు పొంగిపోర్లుతుండడాన్ని చూసి విస్తుపోయారు. స్టోర్​రూం అధ్వానంగా ఉండడాన్ని చూసి సిబ్బందిపై ఫైర్​అయ్యారు. అక్కడ వాడుతున్న ఆయిల్​ను టెస్టుల కోసం ల్యాబ్​కు పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు చేపడతామని పేర్కొన్నారు.