వచ్చే నెల ఐఎస్ఎస్‎కు శుభాంశు శుక్లా.. మరో చరిత్రాత్మక మైలురాయికి చేరువలో భారత్

వచ్చే నెల ఐఎస్ఎస్‎కు శుభాంశు శుక్లా.. మరో చరిత్రాత్మక మైలురాయికి చేరువలో భారత్

న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో భారత్ మరో చరిత్రాత్మక మైలురాయికి చేరువైంది. వచ్చే నెలలో ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లనున్నారు. అమెరికాకు చెందిన ఆక్సియమ్ స్పేస్ ప్రైవేట్ కంపెనీ చేపట్టే ‘ఆక్సియమ్–4’ ప్రైవేట్ కమర్షియల్ మిషన్‎లో ఆయన రోదసి యాత్ర చేయనున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఇస్రో, అంతరిక్ష శాఖ ప్రాజెక్టులపై రివ్యూ నిర్వహించాక ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ నుంచి తొలిసారి ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ 1984లో అంతరిక్షానికి వెళ్లి చరిత్ర సృష్టించారని, మళ్లీ ఇప్పుడు శుభాంశు శుక్లా వెళ్లనున్నారని తెలిపారు.