మునిగిన భైంసా డిపో.. బస్సుపైకి ఎక్కిన సిబ్బంది

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.  . వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలు బీభత్సం సృష్టించండంతో చాలా గ్రామాలు మునిగిపోయాయి.  జనాలు కూడా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని  భైంసాలో ఆర్టీసీ డిపోనీట మునిగింది.  ఇందులో 8 మంది ఆర్టీసీ సిబ్బంది చిక్కుకున్నారు.  బస్సులపై నిలబడి సహాయం కోసం ఎదురుచూశారు. అక్కడికి రెస్క్యూ సిబ్బంది చేరుకుని వారిని అందులో నుంచి బయటకు తీసుకువచ్చారు.  ఆర్టీసీ బస్టా్ండ్ చుట్టూ నీరు చుట్టుముట్టింది.  

అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర్షాలపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితి ఎంటో తెలుసుకున్నారు. జిల్లా ప్రజలు ఎవరూ కూడా  భయపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా ఇవ్వాలని మంత్రికి కేసీఆర్ సూచించారు.  మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురస్తున్నాయి. మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉంటుందని వాతవారణశాఖ వెల్లడించింది.  రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది.