ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రికార్డుస్థాయిలో దంచికొడుతున్న వానలతో కాజీపేట రైల్వే జంక్షన్ ట్రాక్ నీటమునిగింది. ప్లాట్ ఫాం ఎత్తు వరకు రెండు అడుగుల మేర నీరు నిలిచింది.
దీంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. వరంగల్ టౌన్లో కూడా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయ్.
ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు నిండుకుండలా మారింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా భారీగా వరద నీరు చేరడంతో వంతెనలను నీరు తాకుతూ ప్రవహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.