హిందూ పురాణాల్లో శుభ్రమణ్య షష్ఠి... స్కంద షష్టి రోజు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవసేనాధిపతి అయిన కుమారస్వామి... శుభ్రమణ్యేశ్వర స్వామి.. మురుగన్ స్వామికి షష్టి తిథి అంటే చాలా ఇష్టం. ఆరోజున ( జూన్ 12) వల్లీ దేవ సమేత శుభ్రమణ్యేశ్వరస్వామికి.. స్కంధ షష్ఠి పూజ చేస్తే సర్వాభీష్టాలు నెరవేరుతాయని పురాణాల్లో ఉందని పండితులు చెబుతున్నారు. జాతకంలో దోషాలు ఉంటే స్కంద షష్టి రోజున శుబ్రమణ్యేశ్వరస్వామిని పూజించాలని పండితులు చెబుతున్నారు.
తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి తలంటు స్నానమాచరించి పాలు, పంచదారలతో నిండిన కావిడలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తిశ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆచారం తమిళనాడులో విశేషంగా ఆచరణలో ఉన్నది.
. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తిథి జూన్ 11వ తేదీ మంగళవారం సాయంత్రం 5:27 గంటలకు ప్రారంభమై జూన్ 12వ తేదీ బుధవారం సాయంత్రం 7:17 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం స్కంద షష్ఠి పండుగను జూన్ 12న మాత్రమే జరుపుకోవాలి.
స్కంద షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి.. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్ఫించినా సత్సంతాన ప్రాప్తి చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆ రోజు( జూన్ 12) పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకలశుభాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.
పరమశివుని దివ్యతేజస్సు వాయుదేవునిలో ప్రవేశింపబడి తిరిగి వాయుదేవుడు అగ్నిలో ప్రవేశింపజేశాడు. అగ్ని కూడా శివతేజస్సును తాళలేక గంగానదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో వెళ్లి వనంలో (శరవనం) చిక్కుకొని ఆరు ముఖాలు (షణ్ముఖాలు) పన్నెండు చేతులతో ఓ బాలుడు జన్మించాడు. అతడే సుబ్రహ్మణ్యస్వామి లేదా కుమార స్వామి. కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేశారు.
కుమారస్వామి తారకాసురుడితో ఆరు రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించాడు. లోకాన్ని, దేవతలను కాపాడి అందరి మన్ననలు పొందిన సుబ్రహ్మణ్యస్వామి దేవసేనాపతిగా కీర్తింపబడ్డారు. ఆ రోజునే స్కంధ షష్ఠిగా జరుపుకుంటారు. జాతకంలో కుజ దోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు