TTD Goshala Row: తిరుపతి గోశాల ఘటనపై సుబ్రహ్మణ్య స్వామి సీరియస్.. సుప్రీంకోర్టులో పిల్.. ?

TTD Goshala Row: తిరుపతి గోశాల ఘటనపై సుబ్రహ్మణ్య స్వామి సీరియస్.. సుప్రీంకోర్టులో పిల్.. ?

తిరుపతి గోశాలలో గత 3 నెలల్లో 100 కి పైగా ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. భూమన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు సుబ్రహ్మణ్య స్వామి. టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని.. ఈ అంశంపై సమాచారం సేకరిస్తున్నానని అన్నారు స్వామి.

తిరుపతి గోశాలలో 3 నెలల్లో సరైన ఆహారం అందక పెద్ద సంఖ్యలో ఆవులు మరణించటం దారుణమని.. భారత రాజ్యాంగం ప్రకారం గో సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు స్వామి. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిల్ దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు స్వామి. ఈ క్రమంలో సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి లడ్డు విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి కూటమి సర్కార్ కు ముచ్చమటలు పట్టించిన స్వామి.. ఇప్పుడు గోశాల విషయంలో కూడా కూటమి సర్కార్ పై దండయాత్రకు రెడీ అవుతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇటీవల తిరుమలలో వరుసగా వివాదాస్పద ఘటనలు జరుగుతుండటం పట్ల శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల లడ్డు వివాదం మొదలుకొని.. వైకుంఠ ద్వార టోకెన్ల జారీ కేంద్రం దగ్గర తొక్కిసలాట, కొండపై మద్యం అమ్మకాలు, ఇప్పుడు గోశాలలో ఆవుల మరణాలు వంటి అంశాలు తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. కాగా.. తిరుపతి గోశాల అంశంలో వైసీపీ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది కూటమి సర్కార్. గోశాలలో ఆవుల మరణింపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని అంటోంది ప్రభుత్వం. 

►ALSO READ | తిరుమల శ్రీవారికి ఆలస్యంగా నైవేద్యం : గేటు తాళాలు వేసుకుని వెళ్లిపోయిన సెక్యూరిటీ