Vijay GOAT: విజయ్ గోట్ సినిమాలో టీమిండియా మాజీ క్రికెటర్

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The GOAT). మీనాక్షి చౌదరి హీరోయిన్. వెంకట్ ప్రభు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు, టీజర్ విజువల్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈమూవీ వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. 

ఈ సినిమాలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ నటించాడు. ఈ విషయాన్ని అతను విడుదలకు ఒక రోజు ముందు  స్వయంగా ధ్రువీకరించాడు. ఐపీఎల్ లో గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన బద్రీనాథ్..  సోషల్ మీడియాలో స్క్రిప్ట్ రైటర్,  సౌండ్ ఇంజనీర్‌తో కలిసి సెట్స్‌పై పని చేస్తున్నప్పుడు ఫోటోను షేర్ చేశాడు. "#GOAT కోసం నా వంతు కృషి చేశాను. నేను మొదటిసారి సినిమాలో భాగమైనందుకు చాలా  సంతోషంగా ఉన్నాను. నా పాత్ర రివ్యూ కోసం ఎదురు చూస్తున్నాను". అని బద్రీనాథ్ చెప్పాడు. 

బద్రీనాథ్ భారత్ తరపున రెండు టెస్టులు, ఏడు వన్డేలు.. ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. 2008 లో భారత్ తరపున వన్డేల్లో తొలిసారి మ్యాచ్ ఆడాడు. 2011 లో చివరి మ్యాచ్ తో తన కెరీర్ ను లో చివరి మ్యాచ్ ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. మొత్తం 95 మ్యాచ్ ల్లో 11 అర్ధ సెంచరీలతో 1441 పరుగులు చేశాడు. 2010,2011లో వరుసగా 356, 396 పరుగులతో చెన్నై ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.