మొదటిసారిగా పిక్సెల్ ట్యాబ్లెట్ తీసుకురానుంది గూగుల్. ఈ ట్యాబ్లెట్ వచ్చే ఏడాది కల్లా మార్కెట్లో ఉండనుంది. ఇది గూగుల్ కంపెనీ తయారుచేసిన టెన్సర్ జి 2 ప్రాసెసర్ సాయంతో పనిచేస్తుంది. ఇందులో అడ్వాన్స్డ్ ఇమేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ ఫీచర్లు ఉంటాయి. వీడియో కాలింగ్, ఫొటో ఎడిటింగ్‌తో పాటు గూగుల్ అసిస్టెంట్ సర్వీస్ కూడా ఉండనుంది.
సబ్‌స్క్రయిబర్స్‌కి మాత్రమే
యూట్యూబ్లో వీడియోల్ని ఎక్కువ రెజల్యూ షన్లో పెట్టుకొని చూస్తారు చాలామంది. అయితే ఇకపై అలా కుదరదు. ఎందుకంటే.. వీడియోల్ని ఎక్కువ రెజల్యూషన్‌లో చూసేందుకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తప్పనిసరి చేయనుంది యూట్యూబ్. సబ్ స్క్రిప్షన్ లేనివాళ్లు వీడియోల్ని 1,440 పిక్సెల్ క్వాలిటీ వరకు మాత్రమే ఉచితంగా చూడొచ్చు. అలాకాకుండా వీడియోల్ని 4 కె (2,160 పిక్సెల్)లో చూడాలంటే.. రూ.129 కట్టి ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్ ఉంటే... యాడ్స్ లేకుండా వీడియోలు చూడొచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియోలు ప్లే అవుతాయి. అంతేకాదు యూట్యూబ్ ప్రీమియం మ్యూజిక్‌ని ఉచితంగా వినొచ్చు కూడా.