బీసీలకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి

బీసీలకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి

రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్ , వెలుగు:  బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు , రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కాచిగూడలో శనివారం బీసీ సంక్షేమ సంఘం  నిర్వహించిన సమావేశంలో  ఆయన పాల్గొని మాట్లాడారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ బంధు పేరిట కొంత మందికే రూ. లక్షలోపు రుణాలను ఇచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ను నిధులు కేటాయించి చేసి ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు సబ్సిడీపై రుణాలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 12 కుల ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని, కామారెడ్డి సభలో ప్రకటించిన బీసీ  డిక్లరేషన్ అమలు చేయాలన్నారు.

 కార్పొరేట్ కంపెనీలతో బీసీల కులవృత్తులు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరించేందుకుచర్యలు చేపట్టాలన్నారు. కాంగ్రెస్ పై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన  కోరారు.