29 లక్షల మంది రైతులకు సబ్సిడీ కరెంట్: తుమ్మల

29 లక్షల మంది రైతులకు సబ్సిడీ కరెంట్: తుమ్మల

రుణ మాఫీ కింద 4 విడతలుగా రూ.20,616.89 కోట్లు, రైతు భరోసా కింద 2024లో 69.82 లక్షల మంది రైతులకు రూ.7,625.14 కోట్లు విడుదల చేశాం. 2024–25 యాసింగి నుంచి పెట్టుబడి సాయం గా ఎకరాకు ఏడాదికి రూ 12 వేలకు పెంచాం” అని అన్నారు. 2024–25లో 29,14,692 మంది రైతులకు కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రూ.9,800.07 సబ్సిడీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

ఫార్మాసిటీకి 14 వేల ఎకరాలు సేకరించాం: పొంగులేటి

ఫార్మాసిటీ ఏర్పాటుపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..‘‘ప్రభుత్వ, పట్టాభూములతో కలిపి రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, ఇబ్రహీంపట్నం హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం మొత్తం 14,225 ఎకరాల 31 గుంటల భూసేకరణ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే 14,021 ఎకరాల 12 గుంటలు సేకరించాం’’ అని అన్నారు. ఫార్మా సిటీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పరిమితం కాకుండా జిల్లాకు విస్తరించాలని మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు.