ఆంధ్రాలో ఉల్లిగడ్డలపై సబ్సిడీ: రూ.25కే కిలో

ఆంధ్రాలో ఉల్లిగడ్డలపై సబ్సిడీ: రూ.25కే కిలో

దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ఉల్లిగడ్డల రేటు కంట్రోల్ లో ఉంచడానికి సీఎం జగన్ చర్యలు చేపట్టారు. సబ్సిడీ ద్వారా ఉల్లిగడ్డలను రైతుబజార్ల ద్వారా అమ్మేందుకు  చర్యలు తీసుకోవాలని చెప్పారు. బయట ఎంత రేటు ఉన్నా.. ప్రజలకు మాత్రం 25రూపాయలకే కిలో ఉల్లిగడ్డలను అమ్మాలంటూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం పై ఎంత ఆర్థిక భారం పడ్డా భరించాలని  తెలిపారు. అక్రమంగా ఉల్లిపాయల నిల్వలు చేసే వారిపై మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చివరి 18రోజులలో 16వేల క్వింటాళ్ల ఉల్లిగడ్డలను కొనుగోలు చేసినట్లు చెప్పారు అధికారులు. కోనేందుకు 9.50కోట్లను కర్చుచేయగా… అమ్మినపుడు 5.83కోట్లు వచ్చాయని చెప్పారు.