
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) అధ్యక్ష పదవికి ఒలింపిక్ మాజీ స్విమ్మర్ క్రిస్టీ కోవెంట్రీ ఎన్నికయ్యారు. 12 ఏండ్లపాటు ఐఓసీ చీఫ్గా వ్యవహరించిన థామస్ బాచ్ స్థానంలో జూన్ 23న క్రిస్టీ కోవెంట్రీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమె 2033 వరకు పదవిలో కొనసాగనున్నారు. 131 ఏండ్ల చరిత్రలో ఐఓసీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా, ఆఫ్రికా జాతీయురాలిగా జింబాబ్వేకు చెందిన క్రిస్టీ కోవెంట్రీ చరిత్ర సృష్టించారు. జింబాబ్వేకు చెందిన క్రిస్టీ కోవెంట్రీ ఒలింపిక్స్ లో స్విమ్మింగ్ విభాగంలో రెండు సార్లు గోల్డ్ మెడల్ సాధించారు.