ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలోని నెహ్రూ నగర్ లో ఉన్న స్థంభాద్రి హాస్పిటల్ లో సక్సెస్ ఫుల్ గా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేసినట్లు న్యూరో సర్జన్ డాక్టర్ గట్టినేని సురేశ్ శుక్రవారం మీడియాతో తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన లక్ష్మి(85) ఫీట్స్ వచ్చి అపస్మారకస్థితిలో ఖమ్మంలోని స్థంభాద్రి హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు చెప్పారు. ఆమెకు పరీక్షలు చేసి మెదడులో గడ్డ ఉన్నట్లు గుర్తించామన్నారు.
ఇది ఎక్కువ ఖర్చు, హై రిస్క్ తో కూడిన ఆపరేషన్ అన్నారు. కానీ ఖమ్మంలోని స్థంభాద్రి హాస్పిటల్ లోని అత్యాధునిక సౌకర్యాలతో, అతి తక్కువ ఖర్చుతో సర్జరీ చేసినట్లు చెప్పారు. కాగా సర్జరీని చేసిన డాక్టర్ సురేశ్‌కు పలువురు డాక్టర్లు అభినందనలు తెలిపారు.