
పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు పీహెచ్సీలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు 6 నార్మల్ డెలివరీలు జరిగాయి. మంగళవారం డీఎంహెచ్‌వో శ్రీనివాసులు పెబ్బేరు పీహెచ్‌సీని సందర్శించి మెడికల్ ఆఫీసర్ ప్రవళిక, స్టాఫ్ ను అభినందించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రం శివారులో ఉన్న ఎంసీహెచ్‌లో నెలకు 500కు పైగా డెలివరీలు జరుగుతున్నాయన్నారు. పీహెచ్‌సీల్లోనూ డెలివరీలను పెంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారని తెలిపారు.
6 డెలివరీల్లో ఇద్దరు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు జన్మించారని, అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. రూ. 22 లక్షలతో చేపట్టిన పీహెచ్సీ విస్తరణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సీసీ మధుకర్, ఎంపీహెచ్ఏ రాజశేఖర్, స్టాఫ్ నర్సులు చరిత, ఊర్మిళ, కృష్ణ, కాంటింగ్జెన్సీ వర్కర్ గౌరమ్మ పాల్గొన్నారు.