ఇస్రో మరో ముందడుగు: PITA ఇగ్నిషన్ టెస్ట్ విజయవంతం

ఇస్రో మరో ముందడుగు: PITA ఇగ్నిషన్ టెస్ట్ విజయవంతం

ఇస్రో తన పరిశోధనలో భాగంగా మరో ముందడుగు వేసింది. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (LVM3) , పవర్ ఫ్యూచర్ లాంచ్ వెహికల్ పేలోడ్ సామర్ధ్యం పెంపొందించడంలో భాగంగా సెట్ చేసిన 2,000 kN థ్రస్ట్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్ అభి వృద్దిలో ఇస్రో కీలక దశను చేరుకుంది. తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC)లో సెమి క్రయోజెనిక్ ప్రీ బర్నర్ ఇగ్నిషన్ టెస్ట్ ను విజయవంతంగా నిర్వహించింది. 

ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC)చే అభివృద్ధి చేయబడిన సెమీ క్రయోజెనిక్ ఇంజిన్.. ద్రవ ఆక్సిజన్ (LOX), శుద్ధి చేయబడిన కిరోసిన్ (ఇస్రోసేన్) ప్రొపెల్లెంట్ కల యికతో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ తర్వాతి జనరేషన్ లాంచ్ వెహికల్ (NGLV)తో సహా ఇస్రో రాబోయే ప్రయోగ వాహనాలకు భారీ పేలోడ్స్ లిఫ్టింగ్ సామర్ధ్యాన్ని అందించేందుకు దీనిని రూపొందించారు.  

మే 2, 2024న సెమీ-క్రయోజెనిక్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టేజ్ టెస్ట్ (SIET) లో ఈ పరీక్షను నిర్వహించారు. సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ప్రారంభానికి ప్రీబర్నర్ ఇగ్నిషన్ టెస్ట్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించ బడింది. 

లిక్విడ్ రాకెట్ ఇంజిన్ వ్యవస్థల అభివృద్ధిలో ఇగ్నిషన్ ప్రక్రియ అత్యంత కీలకమైనదని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. సెమీ క్రియో ప్రీ బర్నర్ ఇగ్నిషన్ సక్సెస్ తో సెమీ క్రయో ఇంజిన్ అభివృద్ధి లో ఒక ప్రధాన మైలురాయిని సాధించామని పేర్కొంది.