స్పెషల్ : ఫొటో ఎంబ్రాయిడరీ

స్పెషల్ : ఫొటో ఎంబ్రాయిడరీ

కేటియా హెర్రెయా. మెక్సికన్​ అయిన ఈమె ఫొటోగ్రాఫర్​, వీడియోగ్రాఫర్​, ఇండస్ట్రియల్​ డిజైనర్​... వీటన్నింటికీ మించి ఒక ఫైబర్​ ఆర్టిస్ట్​. ఆ ఆర్ట్​ ద్వారానే దేశాలు, ఖండాలు దాటి గుర్తింపును సొంతం చేసుకుంది. ఫొటోగ్రఫీ పట్ల ఆమెకి ఉన్న ప్రేమను హ్యాండ్​ ఎంబ్రాయిడరీతో కలిపి కొత్త ఆర్ట్​ను ఆవిష్కరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే మధురమైన జ్ఞాపకాలను తరాల తరబడి గుర్తు చేసే ఫొటోగ్రాఫ్​లకు ఎంబ్రాయిడరీ ద్వారా ఆ ఫొటోలను వైబ్రెంట్​ పీస్​ ఆర్ట్​గా మారుస్తోంది. ఆ ఎంబ్రాయిడరీతో ఒక పూల బొకే  లేదా ఫొటో బ్యాక్​గ్రౌండ్​లో అందమైన చెట్లు ఏవైనా ఇమిడిపోతాయి. అలా​ ఒక్కో పాత ఫొటోలో  కొత్త జీవాన్ని నింపుతోంది.

‘‘ఎంబ్రాయిడరీలో వాడే మెరిసే రంగులు, లోతైన ప్యాటర్న్స్​కు స్ఫూర్తి నా మెక్సికన్​ హెరిటేజ్​. అందుకే నా వర్క్​లో మీకు వైబ్రెంట్​ కలర్స్, రిచ్​ టెక్చర్,  డైవర్స్​ టెక్స్​టైల్స్​​ ఉంటాయి. మెక్సికన్​ కల్చర్​లో పలురకాల రంగులు, ఫ్లేవర్స్​, ట్రెడిషన్స్ ఉంటాయి. మామూలుగా కనిపించే ఫొటోలకు ఎంబ్రాయిడరీ చేసి అందమైన ఆకృతి ఇస్తున్నా. ఇండస్ట్రియల్​ డిజైనర్​, ఫొటోగ్రాఫర్​, వీడియోగ్రాఫర్​ అయిన నేను హ్యాండ్​ ఎంబ్రాయిడరీని మిక్స్​డ్​ మీడియా ఆర్ట్​గా మార్చా. నాకు ఈ ఐడియా వచ్చింది కరోనా ప్యాండెమిక్​ టైంలో. అప్పుడే అనిపించింది పాత ఫొటోగ్రాఫ్​లకు మరింత జీవం నింపి, ఆనందాల్ని జతచేయొచ్చు కదా అని. 

ఆ ఆలోచన వచ్చిన వెంటనే ప్రయోగాలు చేయడం మొదలుపెట్టా. అప్పుడే ఎంబ్రాయిడరీ త్రెడ్స్​ను అందులో భాగం చేశా. జ్ఞాపకాలను పట్టి ఉంచిన ఫొటోలకు ఎక్స్​ట్రా డైమన్షన్​ కలిపి మరింత అందంగా కనిపించేలా చేయడం మొదలుపెట్టా. ఫొటోగ్రాఫ్స్​ జ్ఞాపకాలనే కాదు కొన్నిసార్లు మనలోని సెన్సరీ ఎక్స్​పీరియెన్స్​ని కూడా తట్టి లేపుతాయి అని చెప్పొచ్చు! కొన్ని ఫొటోలను చూస్తుంటే ఆ ప్లేస్​కి సంబంధించిన వాసన ఫీలయిన సందర్భాలు ఉంటాయి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరూ అలానే ఫీలై ఉంటారు. ఫొటోగ్రఫీని ఎంబ్రాయిడరీతో కలపడం వల్ల సహజంగానే ఆ ఫొటో బ్యూటీ, ఎమోషన్స్​ మెరుగుపడతాయి.


ట్రెడిషనల్​ ఆర్ట్​ ఫామ్స్​ను మోడర్న్​ మీడియాతో కలపాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఫొటో ఎంబ్రాయిడరీ ఆర్ట్​. ఫొటోగ్రఫీ అంటే విజువల్​ స్టోరీ టెల్లింగ్.​ ఎంబ్రాయిడరీతో ఎక్స్​పరిమెంట్స్​ నేను ఇంతకుముందు చేయలేదు. కాకపోతే ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్​ కుట్టును పేపర్​ మీద పెట్టి, దాన్ని డెవలప్​ చేశా. యునిక్​ టెక్నిక్​తో సృజనాత్మకతకు కొత్త దారులు వేశా. పని మొదలుపెట్టేముందు ఆ ఫొటోగ్రాఫ్​ను విశ్లేషించి చూస్తా. 

ఇంతకుముందు నేను వెడ్డింగ్​ ఫొటోగ్రాఫర్​ని కూడా కావడం వల్ల నేను వర్క్​ చేయాలనుకున్న ఫొటోగ్రాఫ్​ సబ్జెక్ట్​లో ఎలిమెంట్స్​ ప్రాముఖ్యత బాగా అర్థమవుతుంది. ఆ ఎలిమెంట్స్​ను హైలైట్​ చేస్తా. జ్ఞాపకార్ధంగా ​వర్క్​ చేయించుకునేందుకు ఎవరైనా నా దగ్గరకు వస్తే... ఆ క్లయింట్ల కోసం నేను వెళ్తా. వాళ్ల నుంచి దూరమైన వాళ్ల ప్రియమైన వ్యక్తుల్లో ఉన్న ప్రత్యేకమైన విషయాలను తెలుసుకుంటా. వాటన్నింటినీ చేసే ఎంబ్రాయిడరీలో ఉంచాలని డిసైడ్​ అవుతా. ఆ తరువాత ఏ ఎంబ్రాయిడరీ చేయాలి? దాన్ని ఎక్కడ ఉంచాలి? అనే విషయం ఛాలెంజింగ్​గా ఉంటుంది. కానీ అదే చాలా కీలకం. అదే ఆ ఫొటోగ్రాఫ్​ను అర్థవంతంగా మారుస్తుంది.


చాలావరకు పాత ఫొటోగ్రాఫ్​లను ఆల్బమ్స్​, బాక్స్​ల్లో పెట్టి భద్రపరుచుకుంటారు. వాటిలో జీవం నింపుతా. ఫొటో​లకు పాత కాలం నాటి అందమైన రోజుల్లోకి తీసుకెళ్లే శక్తి ఉంటుంది. అలాగే ఆ జ్ఞాపకాలను చాలా కాలం భద్రంగా నిక్షిప్తంగా ఉంచుతాయి కూడా. అలాంటి వాటికి ఎంబ్రాయిడరీని కలపడం వల్ల ఆ జ్ఞాపకాలను మెరుగుపరిచనట్టు​ అవుతుంది. అప్పుడవి స్పెషల్​గా కనిపించడమే కాకుండా వాటితో ఎమోషనల్​గా ఇంకాస్త గట్టిగా కనెక్ట్​ అవుతారు” అని చెప్పింది కేటియా.