హైదరాబాద్, వెలుగు: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంఓఎఫ్ఎస్ఎల్) 7వ ఎడిషన్ మోతీలాల్ ఓస్వాల్ బిజినెస్ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ (మొబిక్) ను ఈ నెల 27, 28 తేదీల్లో ముంబైలో నిర్వహించింది. ఫ్రాంఛైజ్ నెట్‌వర్క్‌ను ప్రోత్సహించడానికి, అత్యుత్తమ బ్రోకింగ్ సేవలను గుర్తించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు సంస్థ తెలిపింది.
భారతీయ స్టాక్ మార్కెట్ ప్రస్తుతం బాగున్నందున, ఈ సంవత్సరం మొబిక్ థీమ్‌కు 'మార్కెట్ కా అమృత్ కాల్' పేరును నిర్ణయించామని తెలిపింది. స్టాక్ మార్కెట్లో రాబోయే వృద్ధి గురించి, తయారీ, ఫార్మా, డిఫెన్స్, ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ వంటి రంగాలలోని అవకాశాలపై చర్చించామని ఎంఓఎఫ్ఎస్ఎల్ ప్రకటన తెలిపింది.