టాలీవుడ్‍లోకి వారుసులొస్తున్నారు!

టాలీవుడ్‍లోకి వారుసులొస్తున్నారు!

టాకీస్: టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ కాలం నడుస్తోంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే యాక్టింగ్ శిక్షణ తీసుకొని పెర్ఫెక్ట్ మేకోవర్ తో హీరో మెటీరియల్ గా తనని తాను షోకేస్ చేసుకుంటున్నారు.  నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ని కూడా భవిష్యత్ పవర్ స్టార్ గా ఫ్యాన్స్ అభివర్ణిస్తున్నారు. అతను కూడా ఫిల్మ్ కి సంబందించిన ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అయితే అకిరా నందన్ ఫోకస్ ప్రస్తుతం మ్యూజిక్ మీద ఉందని తెలుస్తోంది.

భవిష్యత్తులో హీరోగా మారే ప్రయత్నం జరగొచ్చు. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ కూడా తండ్రి వారసత్వాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్లాలని డిసైడ్ అయ్యినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్ నేనొక్కడినే సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబు క్యారెక్టర్ లో గౌతమ్ కృష్ణ నటించాడు. ఆ తరువాత ఎడ్యుకేషన్ పైన గౌతమ్ కృష్ణ పూర్తిస్థాయిలో ఫోకస్ చేశాడు. న్యూయార్క్ లో గౌతమ్ కృష్ణ బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నాడని తెలుస్తోంది. చదువుతోపాటు నటనలోనూ శిక్షణ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. రాబోయే ఐదేళ్లలో గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే ఈ ఐదేళ్లలో ముగ్గురు వారసులు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తారు.