కంట్లో నలుసు పడిందని ఆస్పత్రికి వెళితే.. చిన్నారి ప్రాణమే తీశారు..!

ప్రైవేట్ హాస్పిటల్స్ ఘోరాలు రోజురోజుకు పెరిగిపెతున్నాయి. పైసల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు డాక్టర్లు. ఐదేళ్ల చిన్నారి కంట్లో నలుసు పడిందని హాస్పిటల్ కు పోతే ఆపరేషన్ అని నిర్లక్ష్యంగా బలితీసుకున్నారు. హైదరాబాద్ హబ్సిగూడలోని ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ లో ఈ దారుణానికి ఒడిగట్టారు. అన్విక (5) కంటిలో నలక పడిందని తల్లిదండ్రులు శుక్రవారం (నవంబర్ 22)న ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ కు తీసుకువచ్చారు. 

కంటిలో నలక తీసేయాలంటే సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అన్విక సర్జరీ చేసేముందు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప హార్ట్  ఆగిపోయింది. హార్ట్ బీట్ ఆగిపోవడంతో ఐ హాస్పిటల్ డాక్టర్లు అప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియకుండా అన్వికను ఎల్బీనగర్ రెయిన్ బో హాస్పిటల్ కు తరలించారు. రెయిన్ బో హాస్పిటల్ వైద్యులు పాప స్పృహలో లేదని నిర్ధారించారు. ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ పాపను తీసుకువెళ్లాలని బంధువులకు కోరారు.