రీల్స్ కోసం వీడియో చేస్తూ.. యువకుడు మృతి

నర్సంపేట, వెలుగు: రీల్స్ సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఉరేసుకుంటూ.. రీల్స్ చిత్రీకరించబోయి ప్రాణాలు పొగొట్టుకున్నాడు. మంగళవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన ఈ ఘటన సోషల్​ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. నర్సంపేటకు చెందిన కందకట్ల అజయ్ (23) స్థానికంగా ఉన్న హోటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తూ ఉంటాడు. అతడు తరచూ రీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఉండేవాడు.

 ఈ క్రమంలో మంగళవారం రాత్రి హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పని ముగించుకొని, మల్లంపల్లి రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన చిన్న అక్క ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో.. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోని ఫ్రిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సెల్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టి ఉరి వేసుకుంటున్నట్లు రీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలనుకున్నాడు. ఆ వీడియో రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యేలా ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఇంట్లో దులానికి చున్నీ కట్టి, గొంతుకు వేసుకున్నాడు. 

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆ చున్నీ అజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడకు బిగుసుకుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత కుమార్తె ఇంటికి వచ్చిన అజయ్ తల్లి దేవమ్మ.. కొడుకు ఉరివేసుకొని ఉండటం చూసి కన్నీరుమున్నీరు అయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని అజయ్ సెల్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, తన కొడుకు మృతిపై అనుమానం ఉందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.