ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ మైండ్ ఫుల్ సీఈవో సుచన సేథ్ కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. కస్టడీకి తీసుకున్న పోలీసులు.. హత్య ఎలా చేశారు అనే విషయాలను రాబడుతున్నారు. నాలుగేళ్ల కన్న కొడుకును చంపే ముందు ఏం చేశారు.. అనే విషయాలను ఆమె చెబుతుంటే.. పోలీసులు సైతం అవాక్కవుతున్నారు.
నా కుమారుడిని.. నా మాజీ భర్త కస్టడీకి ఇవ్వాలనే ఉద్దేశం లేదు.. కోర్టు ఆదేశాలు వ్యతిరేకంగా ఉన్నాయి.. నా మాజీ భర్తకు.. నా కొడుకును ఇచ్చినట్లయితే చెడిపోతాడు అన్న ఉద్దేశంతో.. కొడుకును చంపాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో వెల్లడించింది సుచనా సేథ్. ఈ రాత్రి నా కొడుకును చంపాలని నిర్ణయించుకున్నప్పుడు.. దగ్గు మందు సిరప్ ఎక్కువ తాగించాను.. ఆ తర్వాత తన ఒళ్లో పడుకోబెట్టుకుని జోలపాట పాడాను.. నేను జోలపాట పాడుతుంటే నా కొడుకు నిద్రపోయాడు. దగ్గు మందు వల్ల గాఢ నిద్రలోకి వెళ్లాడు. ఆ తర్వాత.. నా కుమారుడి ముఖంపై దిండు ఉంచి.. ఊపిరి ఆడకుండా చేశాను.. చనిపోయాడు అని నిర్థారించుకున్న తర్వాత.. అప్పటికే తెచ్చుకున్న పెద్ద బ్యాగులో నా కుమారుడి మృతదేహాన్ని ఉంచాను.. వాడు ఎంతో ఇష్టంగా ఆడుకునే బొమ్మలను వాడిపై పెట్టాను.. ఇదీ విచారణలో సుచనా సేథ్ వెల్లడించిన వివరాలు..
పిల్లలను చంపే తల్లుల సంఘటనలు చాలానే ఉన్నాయి.. చాలానే గతంలో జరిగాయి.. సుచనా సేథ్ కేసు మాత్రమే ఎందుకు ప్రత్యేకం అంటే.. ఆమె మామూలు వ్యక్తి కాదు.. రేపటి టెక్నాలజీని అవపోశన పట్టిన వ్యక్తి.. రోబోలకు కూడా మానవత్వం ఎలా ఉండాలి.. డేటా అనలిస్ట్ ఏంటీ.. ఆర్టిఫిషియల్ ఇంటెజెన్స్ రాబోయే రోజుల్లో ఎలా పని చేస్తుంది అనే అతిపెద్ద సబ్జెక్ట్ పై పరిశోధనలు చేయటంతోపాటు.. లెక్చర్స్ ఇస్తున్న మనిషి.. యంత్రాలకు మానవత్వాన్ని ఆలోచించిన.. మహిళ.. తన కొడుకు విషయంలో.. నిజ జీవితం విషయంలో మాత్రం మానవత్వాన్ని.. వాస్తవాన్ని గ్రహించలేకపోయింది.. అందుకే సుచనా సేథ్ కేసుపై అందరిలో ఆసక్తి నెలకొంది..