సుచిర్ ఇండియా సీఈఓపై కేసు నమోదు

సుచిర్ ఇండియా సీఈఓపై కేసు నమోదు

జూబ్లీహిల్స్, వెలుగు: సుచిర్ ఇండియా సీఈఓ కిరణ్ సుచిర్​పై బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. సంస్థకు చెందిన డబ్బును ఓ ఉద్యోగి సొంతానికి వాడుకున్నాడనే నెపంతో గదిలో బంధించి కొట్టినట్లు ఫిర్యాదు అందింది. ఇన్​స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన బిజినెస్​మెన్ కిరణ్ కు సుచిర్ ఇండియా పేరుతో వరంగల్​లో పార్క్​ఉంది. ఆ పార్క్​కు ఇన్​చార్జిగా రెండు నెలల కింద స్థానికంగా ఉండే ప్రియాంక్ అనే వ్యక్తిని నియమించాడు. 

సందర్శకుల నుంచి టిక్కెట్ రూపంలో డబ్బు వసూలు చేసి ప్రియాంక్​సంస్థ అకౌంట్​లో వేయాల్సి ఉంది. అయితే డబ్బులో రూ.5 లక్షలు తేడా రావడంతో కంపెనీ సీఈఓ కిరణ్..​ ప్రియాంక్​ను సిటీలోని తన ఆఫీసుకు రమ్మన్నాడు. ప్రియాంక్​రాలేదు. తర్వాత నందినగర్​లోని ఇంటికి పిలిపించి కిరణ్​తీవ్రంగా కొట్టాడు.  ఓ గదిలో బంధించాడు. బాధితుడి ఫిర్యాదుతో బంజారాహిల్స్​పోలీసులు అతడిని విడిపించారు. కిరణ్​పై కేసు నమోదు చేశారు.