
కరీంనగర్ సిటీ, వెలుగు: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ప్రభుత్వం ఇచ్చిన 25 శాతం డిస్కౌంట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ సూచించారు. సుడా ఆఫీసులో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 31లోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లిస్తే 25 శాతం డిస్కౌంట్ ఉంటుందన్నారు. ఎల్ఆర్ఎస్ 2020 వెబ్‌సైట్‌లో పరిశీలించినట్లయితే దరఖాస్తుకు సంబంధించి ఫీజు వివరాలు తెలుస్తాయన్నారు. జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలు అన్నీ కలిపి 44,437 దరఖాస్తులకు ఫీజు నిర్ణయించినట్లు చెప్పారు. దరఖాస్తుదారులకు అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి 9652404978 , 7093750333 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.
చొప్పదండి, వెలుగు: చొప్పదండి పట్టణంలో అనుమతి లేని లే-అవుట్లు, ఫ్లాట్ల రెగ్యులరైజ్ కోసం ఎల్‌ఆర్‌ఎస్ అప్లికేషన్ పెట్టిన ప్రతిఒక్కరూ ఈ నెల 31లోపు ఫీజు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ నాగరాజ్ తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎల్ఆర్ఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల కలెక్టరేట్‌లో ఎల్ఆర్ఎస్ పై కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై రివ్యూ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్టార్లు, ఎంపీడీవోల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుపై 25 శాతం తగ్గింపు వర్తిస్తుందని, దీన్ని ప్రజలు ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, డీపీవో మదన్ మోహన్, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.