అవినీతిలో బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కటే : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

అవినీతిలో బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కటే :  కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
  • సుడా చైర్మన్  కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతిలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆర్అండ్ బీ గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల​అక్రమాలు, అవినీతిని వాళ్లే బయటపెట్టుకున్నారన్నారు. నాటి వాటాదారులు బండి సంజయ్ కుమార్, మాజీ మేయర్ సునీల్ రావు ఒక్కటై.. ఇప్పుడు ఒక్కపార్టీలోఉన్నారని ఎద్దేవా చేశారు. 

ఐలాండ్, పార్కుల అభివృద్ధి పనుల్లో భారీ దోపిడి జరిగిందన్నారు. స్మార్ట్ పనుల అక్రమాలపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ  కార్పొరేటర్లు ఒప్పుకోవడం చూస్తే అవినీతి స్పష్టమౌతుందని అన్నారు. సమావేశంలో లీడర్లు గుండటి శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రవణ్ నాయక్, ఇమ్రాన్, షబానా, కవిత, మహాలక్ష్మి, పద్మ పాల్గొన్నారు.